Karnataka: ఢిల్లీ, చెన్నై నుంచి వస్తే క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే: యడియూరప్ప
- మూడు రోజుల సంస్థాగత క్వారంటైన్, 11 రోజుల హోం ఐసోలేషన్ తప్పనిసరి
- ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి మాత్రమే వారం రోజుల సంస్థాగత క్వారంటైన్
- మరోమారు లాక్డౌన్ విధించబోమన్న సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఢిల్లీ, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు తప్పకుండా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
మొత్తం 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్న సీఎం అందులో మూడు రోజులు సంస్థాగత క్వారంటైన్లో ఉండాలని, మిగతా 11 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి మాత్రమే వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో కరోనా లక్షణాలు లేకపోతే మాత్రం హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు.
మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వారిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, కాబట్టి వారి రాకను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా యడియూరప్ప పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్ విధించే ఆలోచనేదీ తమకు లేదని స్పష్టం చేశారు.