COVID-19: ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు

coronavirus test for ministers

  • ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరీక్షలు
  • అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ 
  • ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు
  • ఎమ్మెల్యేలు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నిన్న గుంటూరు జిల్లా నగరంపాలెంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ విషయంపై డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మాట్లాడుతూ... కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందుకోసం ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని కారణాల వల్ల కరోనా పరీక్షలకు హాజరుకాని వారికి అసెంబ్లీ వద్దే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News