Raviteja: రవితేజ సినిమాకు 'నో'  చెప్పిన కేరళ కుట్టి!

Malavika Mohanan rejects an offer with Raviteja
  • రవితేజ సినిమా కోసం మాళవిక మోహనన్ ను సంప్రదించిన యూనిట్
  • ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన నటిస్తున్న మాళవిక
  • విజయ్ దేవరకొండతో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిన వైనం
మాళవిక మోహనన్... కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న మలయాళ భామ. చేసింది తక్కువ సినిమాలే అయినా... ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో ఇంత వరకు ఒక్క సినిమాలోనూ నటించకపోయినా... సినీ అభిమానులందరికి మాళవిక పరిచయమే. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎంతో పాప్యులారిటీని సొంతం చేసుకుంది. 'పేట' సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక... ప్రస్తుతం విజయ్ తో కలిసి 'మాస్టర్' చిత్రంలో నటిస్తోంది.

మరోవైపు, తెలుగులో రవితేజ నటిస్తున్న ఓ చిత్రం కోసం మాళవికను సంప్రదించారట. అయితే, ఆ చిత్రానికి ఈ మళయాల కుట్టి 'నో' చెప్పిందట. 'మాస్టర్' సినిమా విడుదల అయ్యేంత వరకు కొత్త ప్రాజెక్టుల విషయంలో నిర్ణయం తీసుకోకూడదని ఆమె భావిస్తుండటమే దానికి కారణమని చెపుతున్నారు. అయితే విజయ్ దేవరకొండతో కలిసి 'హీరో' సినిమా చేయడానికి గతంలో ఆమె అంగీకరించినప్పటికీ... కొన్న కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి, ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎవరి సరసన, ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాలి.
Raviteja
Malavika Mohanan
Tollywood

More Telugu News