Sensex: 376 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

sensex closes 376 points high

  • చివర్లో పుంజుకున్న కొనుగోళ్లు
  • 100 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభాలను నడిపించిన బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు... మధ్యాహ్న సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడంతో చివరకు లాభాలను మూటగట్టుకున్నాయి. నిన్న నష్టాలను చవిచూసిన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు ఈరోజు పుంజుకోవడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 33,605కి పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పుంజుకుని 9,914 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (4.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.60%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.18%), ఇన్ఫోసిస్ (1.99%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.75%), యాక్సిస్ బ్యాంక్ (-2.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.80%), ఐటీసీ (-1.20%), భారతి ఎయిర్ టెల్ (-1.10%).

  • Loading...

More Telugu News