petrol: ఆగని పెట్రో మంట.. హైదరాబాద్‌లో రూ. 80 దాటేసిన పెట్రోలు ధర
- వరుసగా 11వ రోజూ పెరిగిన ధరలు
- మొత్తంగా పెట్రోలుపై రూ.6.02, డీజిల్‌పై రూ. 6.40 పెరుగుదల
- హైదరాబాద్ కంటే అమరావతిలోనే ఎక్కువ
ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నేడు పెట్రోలుపై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచాయి. తాజా పెరుగుదలతో గత 11 రోజుల్లో పెట్రోలుపై రూ.6.02 పైసలు, డీజిల్‌పై రూ. 6.40 పెరిగింది.
ఇక తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 80 దాటేసి రూ. 80.22కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 74.07గా నమోదైంది. ఏపీ రాజధాని అమరావతిలో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్ కంటే ఎక్కువగా రూ.80.66గా ఉంటే, డీజిల్ ధర రూ. 74.54గా ఉంది. ఇక, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 77.28, రూ.75.79గా నమోదు కాగా, చెన్నైలో రూ. 80.86, రూ.73.69కి పెరిగాయి.