China: ఘర్షణ నేపథ్యంలో.. చైనా ఉత్పత్తుల బహిష్కరణ.. జాబితాలో 500 చైనా ఉత్పత్తులు!

CAIT decided to  Expulsion china goods

  • భారత సైనికులపై దాడితో తీవ్ర నిర్ణయం
  • భారతీయ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రచారం
  • బొమ్మలు సహా సౌందర్య సాధనాల వరకు బహిష్కరణ జాబితాలోకి

భారత్-చైనా దేశాల మధ్య  సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  డ్రాగన్ కంట్రీకి చెందిన 500 వస్తువులను బహిష్కరణ జాబితాలో చేర్చింది.

అలాగే, భారతీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ గూడ్స్-అవర్ ప్రైడ్స్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. క్యాట్ చేసిన బహిష్కరణ వస్తువుల జాబితాలో దుస్తులు, పాదరక్షలు, బొమ్మలు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆహార పదార్థాలు, గడియారాలు, గృహోపకరణాలు, ఫర్నిచర్, ఆటో విడిభాగాలు, దీపావళి, హోలీ వస్తువులు, ఫెంగ్‌షుయ్ వస్తువులు తదితరాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News