America: భారత జాతీయభావం అనే పులిని చైనా రెచ్చగొట్టింది: అమెరికా మీడియా

China provokes Indian Nationalist Tiger

  • రోజూ చిన్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యనే నేడు భారత్ ఎదుర్కొంటోంది
  • ప్రతీకారం విషయంలో మోదీపై ఒత్తిడి తప్పదు
  • కథనాలు రాసుకొచ్చిన అమెరికా పత్రికలు

భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మీడియా స్పందించింది. భారత సైనికులపై దాడి చేసి చైనా తీవ్ర తప్పిదం చేసిందని పేర్కొంది. ఈ దాడి ద్వారా భారత జాతీయభావం అనే పులిని చైనా రెచ్చగొట్టిందని పేర్కొంది. అలాగే, చైనా తీరుతో ప్రధాని మోదీకి కొత్త తలనొప్పులు తప్పవని రాసుకొచ్చింది. ఇండియాను అంతర్జాతీయ శక్తిగా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి సమయంలో చైనా వైఖరితో ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొంది. చైనాకు దీటుగా జవాబివ్వాలన్న ఒత్తిడి మోదీపై పెరుగుతుందని అభిప్రాయపడింది.

వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్ వంటి చిన్నదేశాలు ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుర్కొంటోందని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. కాగా, వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ నదీ లోయలో ఈ నెల 15న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది వరకు భారత సైనికులు, 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News