Tammineni Sitaram: మీడియా అయినా, సోషల్ మీడియా అయినా... అసెంబ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయడం తప్పు: స్పీకర్ తమ్మినేని

Speaker Tammineni Sitharam fires in morphing videos
  • సభలో పరిణామాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారన్న తమ్మినేని
  • చట్టపరమైన చర్యల దిశగా పరిశీలన చేస్తున్నామని వివరణ
సభలో జరుగుతున్న పరిణామాల వీడియోలను మార్ఫింగ్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. మీడియా అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే... వీడియోలు మార్ఫింగ్ చేయడం తప్పు అని హితవు పలికారు. ఓ వీడియోలో తనను కూడా మార్ఫింగ్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసుకున్న డ్రెస్ కు, మార్ఫింగ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్ కు తేడా ఉందని తెలిపారు. ఇలాంటి వీడియోల గురించి సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని, చట్టపరమైన చర్యల దిశగా ఆలోచన చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
Tammineni Sitaram
Morphing Videos
Assembly
Sessions
Media
Social Media
Andhra Pradesh

More Telugu News