Kareena Kapoor: సుశాంత్‌పై చీప్ కామెంట్లు చేసిన కరీనా.. మండిపడుతున్న నెటిజన్లు

Kareen Kapoor facing trolls after comments on Sushant Singh Rajput
  • సుశాంత్ ను చెత్త మొహం అన్న కరీనా
  • వైరల్ అవుతున్న పాత వీడియో
  • బాయ్ కాట్ కరీనా అంటున్న నెటిజన్లు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో... ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబాలపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చే వారిని వీరు ఎదగనీయడం లేదని విమర్శిస్తున్నారు. జనాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో కపూర్ లు కూడా ఉన్నారు. మరోవైపు, గతంలో సుశాంత్ ను ఉద్దేశించి నటి కరీనాకపూర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు.

గతంలో సారా అలీఖాన్ తో కలిసి ఓ టీవీ కార్యక్రమంలో కరీనాకపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా సుశాంత్ గురించి చీప్ కామెంట్లు చేసింది. 'సారాకు నీవు ఇచ్చే డేటింగ్ టిప్ ఏమిటి?' అని వ్యాఖ్యాత ప్రశ్నించగా... 'నీ మొదటి హీరోతో మాత్రం డేటింగ్ కు వెళ్లొద్దు' అని సారాకు చెప్పింది. అంతేకాదు సుశాంత్ ను చెత్త మొహం అని కూడా విమర్శించింది. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరీనాపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరీనాకు పొగరు ఎక్కువని, ఆమెకు అసలు టాలెంటే లేదని విమర్శిస్తున్నారు. కేవలం కపూర్ అనే పేరు వల్లే హీరోయిన్ అయిందని దుయ్యబడుతున్నారు. 'బాయ్ కాట్ కరీనా' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Kareena Kapoor
Sushant Singh Rajput
Bollywood

More Telugu News