Kodali Nani: నిత్యావసరాల పంపిణీకి వాహనాన్ని రూపొందించిన ఏపీ సర్కారు.. పరిశీలించిన మంత్రులు

Kodali Nani and ministers observes ration supply through vehicle

  • ఏపీలో పేదల ఇంటి వద్దకే రేషన్ సరుకులు
  • వాహనంలో ట్రయల్ రన్ నిర్వహణ
  • పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి కొడాలి నాని

ఏపీలో పేదల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బియ్యం, ఇతర సరుకులను ఇంటి ముంగిటకే తీసుకువచ్చి వలంటీర్ల సాయంతో పంపిణీ చేయాలన్నది సీఎం జగన్ సర్కారు యోచన. ఈ విధమైన పంపిణీకి అనువైన వాహనాన్ని సర్కారు రూపొందించింది. ఈ వాహనం ద్వారా నిత్యావసరాల పంపిణీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర ఆర్థికమంతి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. ప్రజా పంపిణీ పారదర్శకంగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని కొడాలి నాని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News