Pakistan: భారత సరిహద్దులో ఫొటోలు తీస్తున్న పాక్ రహస్య డ్రోన్.. కూల్చేసిన బీఎస్ఎఫ్

Pakistani spy drone was shot down by Border Security Force

  • సరిహద్దులో ఫొటోలు తీస్తున్న డ్రోన్
  • 8 రౌండ్ల కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్
  • పాకిస్థానే పంపించిందంటున్న అధికారులు

భారత సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ సెక్టార్, రథువా వద్ద ఈ ఉదయం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా అది ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేశారు. సరిహద్దులో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News