Vijay Sai Reddy: ఇది దేశంలోనే ఒక రికార్డు: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddy praises CM Jagan over pensions
  • సీఎం జగన్ పై విజయసాయిరెడ్డి ప్రశంసలు
  • చెప్పాడంటే చేసి చూపిస్తాడని కితాబు
  • 9.44 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినట్టు వెల్లడి
సీఎం జగన్ ఒక్కసారి మాట ఇచ్చాడంటే తప్పడం కల్ల అని, చెప్పాడంటే చేసి చూపిస్తాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన ఏ పనులు అయినా నిర్దిష్ట కాలపరిమితితో జరుగుతాయని సీఎం జగన్ జూన్ 9న ప్రకటించారని, ఆ ప్రకటన ఫలితమే దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే 96,568 మందికి కొత్తగా పింఛన్లు వచ్చాయని వెల్లడించారు. ఏడాదిలోనే జగన్ సర్కారు 9.44 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇది దేశంలోనే ఒక రికార్డు అని విజయసాయిరెడ్డి వివరించారు.
Vijay Sai Reddy
Jagan
Pensions
YSRCP
Andhra Pradesh

More Telugu News