Vijayasai Reddy: దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు: పార్క్ హయత్ భేటీపై విజయసాయి ట్వీట్

Vijayasai Reddy comments on Nimmagadda Ramesh Sujana Chowdary and Kamineni Srinivas meeting
  • పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం
  • దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు దొరికారు
  • ఫేస్ టైమ్ లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరు?
హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల భేటీ రాజకీయ దుమారం రేపుతోంది. ఊహించినట్టుగానే వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.

పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం అని పేర్కొంటూ, దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేస్ టైమ్ లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరని ప్రశ్నించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వస్తాయని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
Sujana Chowdary
Nimmagadda Ramesh
Kamineni Srinivas
BJP

More Telugu News