Nimmagadda Ramesh Kumar: ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది: హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్

nimmagadda files pitision on high court on ap govt

  • హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదని పిటిషన్
  • ప్రతివాదులుగా సీఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి
  • పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, తనను ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఏపీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఆ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ రమేశ్ కుమార్‌ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు.

కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని పేర్కొంటూ, ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో సీఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఆయన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

  • Loading...

More Telugu News