Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 561 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- అమ్మకాల ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజులుగా కొనసాగిన జోరుకు నేడు బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 34,868కి పడిపోయింది. నిఫ్టీ 165 పాయింట్లు పతనమై 10,305కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.82%), ఐటీసీ లిమిటెడ్ (3.17%), హీరో మోటో కార్ప్ (3.14%), నెస్లే ఇండియా (0.98%), టెక్ మహీంద్రా (0.53%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.43%), ఐసీఐసీఐ బ్యాంక్ (-7.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.79%), యాక్సిస్ బ్యాంక్ (-4.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.08%).