Uttam Kumar Reddy: పక్క రాష్ట్రం ఏపీలో ఒక్కరోజే 36 వేల టెస్టులు చేస్తే ఇక్కడ 10 రోజులు గడిచినా 50 వేల టెస్టులైనా చేయలేకపోయారు: ఉత్తమ్
- తెలంగాణలో కరోనా బీభత్సం
- రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువంటూ విమర్శలు
- ఇది ప్రభుత్వ అసమర్థతేనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరగడంలేదన్న విమర్శలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే 36,407 టెస్టులు చేశారని, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 50 వేల టెస్టులు చేస్తామని చెప్పి 10 రోజులు గడిచిపోయాయని, ఇప్పటికీ అనుకున్న విధంగా టెస్టులు చేయలేకపోతున్నారని విమర్శించారు.
"సేకరించిన శాంపిల్స్ పరీక్ష పూర్తయ్యేవరకు కొత్త శాంపిల్స్ తీసుకోరంట. ఈ అంశంలో ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, "హైదరాబాదులో కరోనా పరీక్షలకు బ్రేక్!" అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్టు చేశారు.