Ram Gopal Varma: అల్లు అర్జున్, రానా కోసం తన కరీర్ ను నాశనం చేస్తున్నారని ఓ హీరో నాతో చెప్పాడు: వర్మ

RGV response on Sushant Singh Rajput suicide
  • బాలీవుడ్ టాప్ 10 స్టార్లలో సుశాంత్ ఒకడు
  • సుశాంత్ మార్కెట్ల వాల్యూ రూ. 75 కోట్లు
  • 10 సినిమాలను నియంత్రించడం కరణ్ వల్ల కాదు
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులను నెటిజెన్లు విమర్శిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. బాలీవుడ్ టాప్ 10 స్టార్స్ లో సుశాంత్ ఒక్కడని... ఆయన మార్కెట్ వాల్యూ రూ. 75 కోట్లని చెప్పారు. అలాంటి వ్యక్తిని ఎవరు అణచివేస్తారని ప్రశ్నించారు.

బాలీవుడ్ లో ప్రతి యేటా దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయని... వాటిలో 10 సినిమాలను నియంత్రించడం దర్శకనిర్మాత కరణ్ జొహార్ వల్ల కాదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Ram Gopal Varma
Tollywood
Sushant Singh Rajput
Karan Johar
Bollywood
Allu Arjun
Rana
Allu Aravind
Daggubati Suresh Babu
Nepotism

More Telugu News