S.Janaki: నాకేమీ కాలేదు... మైసూరులో ఆరోగ్యంగానే ఉన్నా: ఎస్.జానకి

Legendary singer S Janaki responds to speculations
  • ఎస్.జానకి ఇకలేరంటూ ప్రచారం
  • తాను క్షేమంగా ఉన్నానంటూ ఎస్.జానకి ఆడియో సందేశం
  • అభిమానులు ఫోన్ చేసి ఏడుస్తున్నారని వెల్లడి
ప్రముఖ గాయని ఎస్.జానకి ఇక లేరంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్.జానకి స్వయంగా స్పందించారు. తనకేమీ కాలేదని, తాను మైసూరులో ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సమస్య లేదని, పిచ్చి పిచ్చిగా ఏవేవో పోస్టులు పెడుతుంటారని, అలాంటి పోస్టులను నమ్ముతూ కూర్చుంటే మనమేం చేయగలం? అంటూ విచారం వ్యక్తం చేశారు. వాళ్లు చచ్చారు, వీళ్లు చచ్చారు అంటూ పోస్టులు పెట్టడం ఏంటి? వాళ్లు ఉన్నారా, లేదా అని తెలుసుకోవాలి కదా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.

తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో అభిమానులు ఫోన్ చేసి విలపిస్తున్నారని, వాళ్లను ఓదార్చడంతోనే తనకు సరిపోతోందని అన్నారు. ఈ మేరకు ఎస్.జానకి ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. హైదరాబాదులో కరోనా ఎక్కువగా ఉందంటున్నారని, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

S.Janaki
Singer
Speculations
Audio Message
Social Media

More Telugu News