China: భారత్‌లో 59 యాప్‌ల నిషేధంపై చైనా ప్రభుత్వం స్పందన
- ఆందోళన వ్యక్తం చేస్తున్నాం
- అన్ని అంశాలను ధ్రువీకరించుకుంటున్నాం
- అంతర్జాతీయ నిబంధనలకు లోబడే పనిచేయాలి
- మా కంపెనీలకు చైనా ఈ విషయాన్ని ఎల్లప్పుడూ చెబుతుంది
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా పాల్పడుతోన్న చర్యలకు ప్రతిగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయంపై డ్రాగన్ దేశం స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ ప్రకటన చేశారు. యాప్‌లను నిషేధించిన విషయంలో అన్ని అంశాలను ధ్రువీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
'అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేయాలని మా దేశ వాణిజ్య, వర్తక సంస్థలకు చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చెబుతుంది. చైనా పెట్టుబడిదారులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు.