Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy writes letter to Modi

  • కరోనా కట్టడిలో టీఎస్ ప్రభుత్వం విఫలమైంది
  • కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
  • హైకోర్టు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కూడా పట్టించుకోవడం లేదు

కరోనాను కట్టడి చేసే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. హైదరాబాదులో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని... త్వరలోనే నగరమంతా హాట్ స్పాట్ కాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 70 వేల కోవిడ్ టెస్టులు మాత్రమే చేశారని తెలిపారు.

రాష్ట్రంలో కేవలం 22 ట్రూనాట్ కిట్స్, ఒకే ఒక సెంట్రల్ ల్యాబ్ ఉందని రేవంత్ చెప్పారు. టెస్టుల విషయంలో హైకోర్టు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. హైదరాబాదు పరిసరాల్లో ఎన్నో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని... వాటిని ప్రభుత్వం వాడుకోవడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోకపోతే... పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News