Bhuvneshwar: కరోనా బారిన ఉద్యోగులు.. భువనేశ్వర్‌లోని టెక్ మహింద్రా కార్యాలయానికి సీల్

Tech Mahindra Campus closed for 72 hours after employees infected to covid

  • శానిటైజేషన్ నిమిత్తం 72 గంటలపాటు కంపెనీ మూత
  • క్వారంటైన్‌లో ఉండాలంటూ 65 మందికి ఆదేశాలు
  • ఏడుగురి కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో అధికారులు

ఉద్యోగులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతుండడంతో ఐటీ సేవల కంపెనీ టెక్ మహింద్రా భువనేశ్వర్‌లోని తన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. వారం రోజుల వ్యవధిలో కంపెనీలో పనిచేసే ఏడుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో అప్రమత్తమైన భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిన్న కార్యాలయానికి సీలు వేసింది. శానిటైజేషన్ నిమిత్తం 72 గంటలపాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది.

కంపెనీలో తొలికేసు గత నెల 29న వెలుగు చూడడంతో ఆ వెంటనే హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ 65 మందిని అధికారులు ఆదేశించారు. 14 రోజుల వ్యవధిలో ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసి చికిత్స అందించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, కొవిడ్ బారినపడిన ఏడుగురు ఉద్యోగుల కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నట్టు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ తెలిపారు.

  • Loading...

More Telugu News