ZOOM App: మాది చైనా సంస్థ కాదు.. సీఈవో పేరు చూసి అపోహ పడొద్దు: జూమ్ యాప్

Zoom App gives clarity that they are not Chinese

  • ఇటీవల 59 చైనా యాప్ లను నిషేధించిన భారత్
  • జూమ్ యాప్ చైనాకు చెందినదంటూ వార్తలు
  • తమది అమెరికా సంస్థ అని చెప్పిన జూమ్ ఇంజినీరింగ్, ప్రాడక్ట్స్ అధ్యక్షుడు

చైనాకు చెందిన 59 యాప్ లను భారత్ నిషేధించిన తర్వాత... అందరి దృష్టి జూమ్ యాప్ పైకి మళ్లింది. లాక్ డౌన్ సమయంలో కాన్ఫరెన్సింగ్ యాప్ గా జూమ్ బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. అన్ని రకాల కాన్ఫరెన్సులతో పాటు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు కూడా జూమ్ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఈ తరుణంలో జూమ్ యాప్ ను ఎందుకు నిషేధించడం లేదనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం జూమ్ కూడా చైనా యాప్ అనే భావన ఉండటమే. దీంతో, జనాలు గూగుల్ మీట్, జియో మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీటి డౌన్ లోడ్లు భారీ ఎత్తున పెరిగాయి.

ఈ నేపథ్యంలో, తమది చైనాకు చెందిన సంస్థ కాదని జూమ్ చెబుతోంది. తమకు ఎప్పటికీ ఇండియా ముఖ్యమైన మార్కెట్ గానే ఉంటుందని జూమ్ ఇంజినీరింగ్, ప్రాడక్ట్స్ అధ్యక్షుడు వెల్చామి శంకరలింగం తెలిపారు. జూమ్ యాప్ ను చైనాతో ముడిపెడుతూ వార్తలు వస్తుండటం బాధిస్తోందని చెప్పారు. జూమ్ యాప్ అమెరికాకు చెందినదని తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్ జోన్స్ లో దీన్ని స్థాపించారని చెప్పారు. కంపెనీ సీఈవో ఎరిక్ ఎస్ యువాన్ మూలాలు చైనాలో ఉండటం వల్ల జూమ్ ను చైనా కంపెనీగా అపోహ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. 

  • Loading...

More Telugu News