Janasena: సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారని.. జనసేన నేతపై పోలీసులకు వైసీపీ నేత ఫిర్యాదు

Case filed against janasena leader in Guntur
  • పవన్‌పై చేసిన విమర్శలకు సోషల్ మీడియాలో కౌంటర్
  • పార్టీలోని కొందరు కాపునేతలు జగన్‌పై విశ్వాసంతో ఉన్నారని వ్యాఖ్య
  • సత్తెనపల్లి జనసేన నేత భావన్నారాయణపై ఫిర్యాదు
ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన నేత భావన్నారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

జనసేనానిపై వైసీపీ నేతలు చేసిన ఆ విమర్శలను తప్పుబడుతూ భావన్నారాయణ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. అధికార పార్టీలోని కాపు నేతలు జగన్‌పై విశ్వాసం చూపిస్తున్నారని వాటిలో పేర్కొన్నారు. అయితే, భావన్నారాయణ పోస్టులు అధికార పార్టీ నేతలను కించపరిచేలా ఉన్నాయంటూ వైసీపీ నేత మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Janasena
Guntur District
YSRCP
Case
Social Media

More Telugu News