YV Subba Reddy: సర్క్యులేట్ అవుతున్న ఆ పీడీఎఫ్ ఫైళ్లకు, విజయమ్మ రాసిన పుస్తకానికి సంబంధంలేదు: వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy says some pdf files circulate in the name of YS Vijayamma book are false
  • 'నాలో... నాతో... వైఎస్సార్' పుస్తకం రాసిన విజయమ్మ
  • ఇంటర్నెట్లో నకిలీ పీడీఎఫ్ ఫైళ్లు
  • డీజీపీకి ఫిర్యాదు చేశామన్న వైవీ సుబ్బారెడ్డి
తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితఘట్టాల ఆధారంగా వైఎస్ విజయమ్మ 'నాలో... నాతో... వైఎస్సార్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ ఆవిష్కరించారు.

అయితే,  ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమాల్లో ఈ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైళ్లు దర్శనమిస్తున్నాయని టీటీడీ చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ పీడీఎఫ్ ఫైళ్లు నకిలీవని స్పష్టం చేశారు. విజయమ్మ రాసిన 'నాలో... నాతో... వైఎస్సార్' పుస్తకానికి ఆన్ లైన్ లో కనిపిస్తున్న పీడీఎఫ్ ఫైళ్లకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. విజయమ్మ పుస్తకానికి సంబంధించినంత వరకు ఎమ్మెస్కో పబ్లికేషన్స్ సంస్థ అచ్చువేసిందే అసలైన పుస్తకమని వైవీ వివరించారు.

సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న పీడీఎఫ్ ఫైళ్లలో ఉన్న సమాచారానికి, విజయమ్మ రాసిన పుస్తకంలో ఉన్న సమాచారానికి ఎంతో తేడా ఉందని, దురుద్దేశ పూరితంగానే ఈ విధంగా నకిలీ పీడీఎఫ్ ఫైళ్లను సృష్టించినట్టు అర్థమవుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
YV Subba Reddy
PDF Files
YS Vijayamma
Book
Nalo Natho YSR
Internet
Social Media
DGP
YSRCP
Andhra Pradesh

More Telugu News