India: నేడు భారత భూభాగంలో.. సమావేశం కానున్న భారత్-చైనా లెఫ్టినెంట్ జనరళ్లు
- సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యం
- లడఖ్‌లోని చుసూల్‌లో చర్చలు
- విధివిధానాల ఖరారు
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్న ఇరు దేశాలు నేడు మరోమారు చర్చలు జరపనున్నాయి. తూర్పు లడఖ్‌లోని అధీనరేఖ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు నేడు సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా చైనా సైన్యం గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లింది.