Visakhapatnam District: విశాఖ ఫార్మా ప్రమాదంపై హోం మంత్రి సుచరిత దిగ్భ్రాంతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ap home minister sucharitha responds about parawada pharma incident

  • పోలీసులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న హోం మంత్రి
  • ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు చెప్పిన కార్మిక మంత్రి జయరాం
  • ప్రాథమిక విచారణ అనంతరం కారణాలు తెలుస్తాయన్న మంత్రి

విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో గత రాత్రి జరిగిన భారీ ప్రమాదంపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులను అడిగి ప్రమాదం గురించి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇప్పటికే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. ప్రమాద కారణాలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేసే కార్మికుడు  శ్రీనివాసరావు (45) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో మల్లేశ్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News