Rajasthan: అనుకున్నదే అయింది.. సీఎల్పీ సమావేశానికి పైలట్ డుమ్మా
- పట్టు విడవని పైలట్, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు
- సచిన్ తీరుపై హైకమాండ్ గుస్సా
- మరో అవకాశం ఇచ్చి చూసే యోచన
అనుకున్నదే అయింది. నిన్నటి సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు నేటి సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. పైలట్ వైఖరిపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం.. తమ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్‌కు మరో అవకాశం ఇచ్చి చూడాలని, అప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాకపోతే వేటు వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, నిన్నటి సమావేశానికి 104 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాగా, సచిన్ వర్గంలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు లేఖ ఇచ్చినట్టు కాంగ్రెస్ పేర్కొంది. అయితే, అది అవాస్తవమని, 30 మంది ఎమ్మెల్యేలూ తమతోనే ఉన్నారని సచిన్ తేల్చి చెప్పారు. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని పేర్కొన్నారు.