Sujana Chowdary: సుజనా చౌదరీ.. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందుల తపస్సు చేయాలా?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Sujana Chowdary
  • నీలాంటి చౌకబారు వ్యక్తులను మేము లెక్క చేయము
  • బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకో
  • మేకప్ తీసేస్తే ఒరిజినల్ రంగు పసుపే
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సుజనా చౌదరి .. నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా? నీలాంటి చౌకబారు శరణార్ధులని మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్... బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి' అని ట్వీట్ చేశారు.

సుజనా మాటలు విని కొందరు బీజేపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి, మొత్తం ఇండస్ట్రీనే పోషిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే కమెడియన్ గుర్తుకొస్తున్నాడని అన్నారు. సుజనా కెమెరా ముందుకు వచ్చినప్పుడే కాషాయమని... మేకప్ తీసేస్తే ఒరిజినల్ రంగు పసుపేనని విమర్శించారు.
Sujana Chowdary
BJP
Vijayasai Reddy
YSRCP

More Telugu News