Donald Trump: మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ చట్టం... సంతకం చేయనున్నానని ట్రంప్ కీలక ప్రకటన!

Trump Says Merit Based Imigration Law Soon

  • నవంబర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు
  • కొత్త ఉత్తర్వులు త్వరలోనే అమలులోకి
  • మీడియా సమావేశంలో వెల్లడించిన ట్రంప్

రానున్న నవంబర్ లో అధ్యక్ష ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే అత్యంత బలమైన మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ విధానాన్ని తీసుకు రానున్నానని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఉత్తర్వులపై తాను సంతకం చేయనున్నానని వెల్లడించారు. ఈ చట్టం అమలులోకి వస్తే, ఇండియా, దక్షిణాసియా దేశాల నుంచి చిన్న వయసులోనే వచ్చిన వారి ప్రయోజనాలు కాపాడబడతాయని ఆయన అన్నారు.

"అత్యంత ముఖ్యమైన ఓ చట్టంపై అతి త్వరలోనే సంతకం చేయబోతున్నా. ఈ చట్టం చాలా బలంగా ఉంటుంది. మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ దిశగా దేశం సాగనుంది. కుటుంబ బంధాలతో వీసాలు పొందే అవకాశాలు తగ్గుతాయి" అని శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలోనే డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ ఎరైవల్స్) తేనున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని వ్యాఖ్యానించిన ఆయన, డీఏసీఏ ఎలా పని చేస్తుందో చూడాలని కన్సర్వేటివ్ రిపబ్లికన్లు కూడా ఆసక్తితో ఉన్నారని ట్రంప్ అన్నారు.

కాగా, డీఏసీఏ కార్యక్రమం అమలులోకి వస్తే, తమ తల్లిదండ్రుల వెంట డాక్యుమెంట్లు లేకుండా చిన్న వయసులోనే యూఎస్ లోకి ప్రవేశించిన వారి హక్కులు కాపాడబడతాయని, దాదాపు 7 లక్షల మంది యువతకు లబ్ది చేకూరుతుందని, వారికి వర్క్ పర్మిట్లు అందజేయబడతాయని ట్రంప్ సర్కారు చెబుతోంది.

  • Loading...

More Telugu News