Sensex: రిలయన్స్ లో ప్రాఫిట్ బుకింగ్.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 19 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 11 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా లాభపడ్డ ఇన్ఫోసిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. చివరి గంటలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఇన్ఫ్రా, ఫైనాన్సియల్ స్టాకులు ప్రాఫిట్ బుకింగ్ కు గురయ్యాయి. అయితే, ఐటీ స్టాకులు ఇన్ఫోసిస్ లాభపడటం మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్ల లాభంతో 36,052కి పెరిగింది. నిప్టీ 11 పాయింట్లు లాభపడి 10,618 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (6.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.13%), టీసీఎస్ (2.85%), టెక్ మహీంద్రా (2.78%), యాక్సిస్ బ్యాంక్ (2.11%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-4.24%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.71%), ఓఎన్జీసీ (-1.49%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.44%), బజాజ్ ఫైనాన్స్ (-1.33%).