COVID-19: దేశంలో ఒక్కరోజులో 34,956 మందికి సోకిన కరోనా

COVID19 cases cross the 10 lakh mark in India with the highest singleday spike of 34956 cases

  • కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,03,832
  • మృతుల సంఖ్య మొత్తం 25,602
  • 3,42,473 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 6,35,757 మంది  

భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 34,956 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 687 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,03,832కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 25,602కి పెరిగింది. 3,42,473 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,30,72,718 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,33,228 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News