Russia: భర్తకు విడాకులిచ్చి, అతని పెంపుడు కొడుకునే పెళ్లాడిన సోషల్ మీడియా సెలబ్రిటీ!

Russia Social Media Star Marriage his Son
  • ప్రేమ గుడ్డిదనడానికి మరో నిదర్శనం
  • ఏడేళ్ల వయసు నుంచి పదేళ్ల పాటు బిడ్డను పెంచిన మారియా
  • అతనితో ప్రేమలో పడి గర్భం, తాజాగా వివాహం
ప్రేమ గుడ్డిదని, ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేమనడానికి ఇంతకన్నా మరో నిదర్శనం అక్కర్లేదేమో. ఓ యువకుడు, తనను పెంచిన తల్లినే ప్రేమించి పెళ్లాడాడు. ఈ ఘటన రష్యాలో జరిగింది. సోషల్ మీడియాలో తన వీడియోలు, ఫోటోలతో సెలబ్రిటీగా ఎదిగి 4 లక్షల మంది ఫాలోవర్లతో ఉన్న 35 ఏళ్ల మెరీనా బల్మషేవ, తాను పెంచిన యువకుడిని పెళ్లాడింది.

విస్తుపోయే ఈ ఘటన వెనకున్న మరిన్ని వివరాల్లోకి వెళితే, అలెక్స్ ఆరే అనే వ్యక్తిని పదేళ్ల క్రితం పెళ్లాడిన మెరీనా, ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని, వారిని పెంచారు. తాజాగా, వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా, పిల్లల బాధ్యతను కోర్టు అలెక్స్ కు అప్పగించింది. ఆ తరువాత తాను దాదాపు పదేళ్ల పాటు పెంచిన వ్లాదిమిర్ వోయా (20)తో మెరీనా ప్రేమలో పడింది.

వీరిద్దరూ పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభంలోనే వివాహం జరగాల్సి వున్నా, కరోనా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు నిబంధనలు సడలించడంతో రిజిస్ట్రీ కార్యాలయంలో ఇద్దరూ ఒకటయ్యారు. అసలే విడ్డూరమైన తమ వివాహాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇవి వైరల్ అవుతున్నాయి. పెంచిన బిడ్డను పెళ్లాడటంపై స్పందించిన మెరీనా, పెంచుకున్న కొడుకుతో పెళ్లేంటని కొందరు ఆడిపోసుకున్నా, అది తన ఇష్టమేనని గట్టిగానే చెబుతోంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటం గమనార్హం.
Russia
Marriage
Son
Social Media

More Telugu News