Venkaiah Naidu: కరోనాపై పోరాటంలో మీడియా పాత్ర అమోఘం: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu praises media role against corona pandemic
  • ప్రజలను చైతన్యం చేస్తోందంటూ కితాబు
  • సోషల్ మీడియా ప్రచారంతో ఆందోళన చెందవద్దని సూచన
  • కరోనాతో మరణించిన జర్నలిస్టులకు వెంకయ్య నివాళి
దేశంలో తాజా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో  మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు. మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వారికి నివాళులు అర్పించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
Venkaiah Naidu
Media
Social Media
Corona Virus
Pandemic

More Telugu News