Sensex: వ్యాక్సిన్ రాబోతోందన్న వార్తలతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 511 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాబోతోందనే వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ ఉదయం నుంచి కూడా సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 511 పాయింట్లు లాభపడి 37,930కి పెరిగింది. నిఫ్టీ 140 పాయింట్లు పుంజుకుని 11,162కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.14%), మారుతి సుజుకి (4.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.41%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (4.36%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.04%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-4.31%), ఏసియన్ పెయింట్స్ (-1.85%), భారతి ఎయిర్ టెల్ (-1.39%), సన్ ఫార్మా (-1.36%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.96%).