LKG: ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై ఎల్ కేజీ, యూకేజీ... విద్యావ్యవస్థలో సంచలన మార్పులకు సీఎం జగన్ శ్రీకారం

LKG and UKG in AP Government schools

  • ఏపీ విద్యావ్యవస్థలో ప్రీప్రైమరీ విద్యకు ప్రాధాన్యం
  • ప్రత్యేక సిలబస్ రూపొందించాలన్న సీఎం జగన్
  • వచ్చే ఏడాది నుంచి ఎల్ కేజీ, యూకేజీ

ఇప్పటివరకు ఎల్ కేజీ, యూకేజీ విద్య కేవలం ప్రైవేటు స్కూళ్లలోనే అందుబాటులో ఉండేది. ఇకపై ఆ తరహా విద్యాబోధన ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలోనూ అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎల్ కేజీ, యూకేజీ విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ విద్యాశాఖకు దిశా నిర్దేశం చేశారు.

ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News