Hyderabad: వర్షంలో తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

Heavy rains in Hyderabad from today morning

  • ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీనది, చిలుక, కానలవాగులు

హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపైకి నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, గాజుల రామారం, సూరారం, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, దారుస్సలాం సహా పలు చోట్ల భారీ వర్షం పడింది.

ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షానికి అంబర్‌పేట- మూసారాంబాగ్ వద్ద మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోమిన్‌పేటలో చిలుకవాగు, కానలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు, వికారాబాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News