Nara Lokesh: 'ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నారు' అంటూ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
- అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఘటన ఇది
- రాజు అనే వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారు
- 8 గంటల పాటు ఎదురు చూశారు
- వైద్యం అందక రాజు గారు చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు
ఏపీలో పేదలకు కనీస చికిత్స కూడా అందడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జగన్ గారి అసమర్థ ప్రభుత్వ పనితీరుకి ఉదాహరణ' అని ఆయన ట్వీట్ చేశారు.
'అనారోగ్యానికి గురైన ధర్మవరంకి చెందిన రాజుని కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. 8 గంటల పాటు... ప్రాణాలు పోతున్నాయి కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించలేదు. వైద్యం అందక రాజు గారు చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు' అని లోకేశ్ విమర్శించారు.
'జగన్ రెడ్డి గారి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆయన మొద్దునిద్ర వీడాలి' అని ఆయన విమర్శలు గుప్పించారు.