Pawan Kalyan: అమితాబ్ కూడా కరోనా బారినపడ్డారు.... ఇప్పుడు షూటింగులు జరిపితే కష్టం!: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on cinema shootings amidst corona outbreak
  • జనసేన సోషల్ మీడియా  విభాగానికి పవన్ ఇంటర్వ్యూ
  • అనుమతి ఉన్నా షూటింగ్ చేసుకోలేకపోతున్నామని వెల్లడి
  • వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదన్న జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్  పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక అంశాలపై స్పందించిన ఆయన కరోనా నేపథ్యంలో చిత్రరంగం పరిస్థితి ఏంటన్న దానిపైనా తన అభిప్రాయాలు వెల్లడించారు. తొందరపాటుతో షూటింగులు జరిపితే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ఇటీవలే అమితాబ్ బచ్చన్ కూడా కరోనా బారినపడ్డారని, ఇప్పుడు షూటింగ్ లు జరిపే పరిస్థితులు లేవని అన్నారు. షూటింగ్ సందర్భంగా ఎవరు కరోనా బారినపడినా ఇబ్బందేనని పేర్కొన్నారు. "ఇటీవల కొందరు సినీ పెద్దలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కలిశారు. దాంతో ఆ రెండు ప్రభుత్వాలు పాక్షిక అనుమతులు ఇచ్చాయి. అయినా గానీ షూటింగ్ లు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ పరిస్థితి తప్పదు" అని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Shootings
Tollywood
Corona Virus
Janasena
Social Media

More Telugu News