Virat Kohli: నేను చేసిన కేక్‌ మా ఆవిడకు బాగా నచ్చింది!: విరాట్ కోహ్లీ

Baked a cake for first time says kohli

  • ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ చాట్‌ షోలో మాట్లాడిన కోహ్లీ
  • అనుష్క కోసం జీవితంలో తొలిసారి కేక్‌ తయారు చేశాను
  • అనుష్క పుట్టిన రోజు సందర్భంగా  చేశా 

తాను తన భార్య, సినీ హీరోయిన్ అనుష్క శర్మ కోసం స్వయంగా కేక్ చేశానని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ తెలిపాడు. 'ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ చాట్‌ షో'లో తాజాగా కోహ్లీ మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు. తాను కేక్‌ తయారు చేయడం జీవితంలో ఇదే మొదటిసారని వివరించాడు. తన భార్య అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ కేక్‌ తయారు చేశానని చెప్పాడు.

తాను కేక్‌ తయారు చేయడం తొలిసారే అయినప్పటికీ బాగా రుచిగా తయారయిందని, ఆ కేక్‌ అనుష్కకు నచ్చిందని కోహ్లీ చెప్పాడు. తనకు కేక్‌ నచ్చిందని ఆమె ఆ సమయంలో చెప్పిన ఆ మాటలు తనకెంతో ప్రత్యేకమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, కరోనా నేపథ్యంలో క్రికెట్ బంద్ కావడంతో క్రికెటర్లు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

  • Loading...

More Telugu News