Niharika: తన చెల్లి నిహారిక నిశ్చితార్థ తేదీని చెప్పిన వరుణ్ తేజ్
- చైతన్య అనే గుంటూరు యువకుడితో పెళ్లి
- ఆగస్ట్ 13న నిశ్చితార్థం
- ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్
మెగా బ్రదర్ నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక వివాహం గుంటూరుకు చెందిన చైతన్యతో జరగనున్న విషయం విదితమే. ఈ వివాహ వేడుకను త్వరలోనే నిర్వహిస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. తన కాబోయే భర్తతో కలసి తను ఇటీవల దిగిన ఫొటోలను నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి కూడా.
ఇదిలా ఉంచితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్... నిహారిక పెళ్లి గురించి స్పందిస్తూ.. నిశ్చితార్థ తేదీని వెల్లడించాడు. ఆగస్ట్ 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వారి ఎంగేజ్మెంట్ జరగనుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది బంధువుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.