Andhra Pradesh: ఆ బిల్లులను కేంద్రానికి పంపడంలో ఎందుకింత తాత్సారం?: యనమల

Tdp leader yanamala fires on ap govt

  • రాష్ట్రంలో ఫ్యూడలిస్ట్ పాలన
  • ఎస్ఈసీ రమేశ్ కుమార్ నియామకంలో తాత్సారం ఎందుకు?
  • కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేంద్రానికి పంపకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని, వెంటనే కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ నియామకంలో తాత్సారం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో ఫ్యూడలిస్టు పాలన రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రాష్ట్రాలు లక్ష్మణ రేఖను అతిక్రమిస్తే కేంద్రం జోక్యం చేసుకోకతప్పదని, ఏపీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని యనమల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News