raghurama krishnam raju: వైఎస్‌ జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం సబబు కాదు: రఘురామకృష్ణరాజు

raghurama krishnam raju fires on  jagan

  • మాతృ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలి
  • ప్రముఖులు ఇదే సూచిస్తున్నారు
  • వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని జగన్ అంటున్నారు
  • మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తున్న జగన్‌ తీరు సరికాదని ఆయన చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  మాతృ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన ఉండాలని ప్రముఖులు సూచిస్తోంటే వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని జగన్‌ ఎదురు ప్రశ్నలు వేయడం సబబు కాదని ఆయన చెప్పారు. మాతృభాషలోనే చాలా మంది చదువుకుని, గొప్ప వారు అయ్యారని ఆయన హితవు పలికారు.

మాతృభాషలో విద్యాబోధన చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మన భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఒక దారి, నాదో దారి అన్న జగన్ ధోరణి మారాలని ఆయన చెప్పుకొచ్చారు. ‌ ఇంగ్లిష్ మీడియం ప్రతిపాదనను ఆయన వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News