Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం: కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్

Ramesh Pokhriyal comments on Pawan Kalyan

  • నూతన విద్యావిధానం తీసుకువస్తున్న కేంద్రం
  • స్వాగతించిన పవన్ కల్యాణ్
  • ట్విట్టర్ లో పవన్ విషయం ప్రస్తావించిన కేంద్ర మంత్రి

కేంద్రం ఎన్ఈపీ-2020 పేరిట నూతన విద్యావిధానం (న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగాలన్న ప్రధాన సిద్ధాంతంతో ఎన్ఈపీ-2020ని కేంద్రం ప్రతిపాదించింది. ఈ విధానాన్ని స్వాగతిస్తున్నట్టు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ విద్యావిధానం ఎలా ఉండాలన్న దానిపై చాన్నాళ్ల క్రితమే జనసేన ఆలోచనలను ఓ వీడియోలో వివరించారు. దీనిపై తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు.

బహుముఖ విద్యావిధానం పట్ల పవన్ కల్యాణ్ వెల్లడించిన అభిప్రాయాలను కేంద్రం నూతన విద్యావిధానం తుది ముసాయిదా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుందని వెల్లడించారు. తాజా విద్యావిధానంలో విద్యార్థులకు విస్తృతస్థాయిలో సబ్జెక్టులు ఎంచుకునే వీలుంటుందని, జీవితంలో తాము ఎంచుకున్న మార్గంలో పయనించేందుకు అనువైన సబ్జెక్టులు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ లో వివరించారు.

  • Loading...

More Telugu News