Allu Arjun: సినిమా మీద ఆ పేద రైతుకు ఉన్న అభిరుచి వల్లే మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం: అల్లు అర్జున్
- నేడు అల్లు రామలింగయ్య వర్ధంతి
- తాత చనిపోయిన రోజును మర్చిపోలేనన్న బన్నీ
- అనుభవం పెరుగుతున్న కొద్దీ.. ఆయన గురించి ఎక్కువగా అర్థమవుతోంది
తెలుగు చలనచిత్ర చరిత్రలో దివంగత అల్లు రామలింగయ్య సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తనకే సాధ్యమైన హాస్యంతో ప్రేక్షకులను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన ఆయన వర్ధంతి నేడు. 2004 జూలై 31న ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
తన తాత వర్ధంతి సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఆయన మమ్మల్ని వదిలి పోయిన ఈరోజును మర్చిపోలేను. ఆరోజు కంటే ఈరోజు నాకు ఆయన గురించి ఎక్కువ తెలుసు. నాకు అనుభవం పెరుగుతున్న కొద్దీ... ఆయన కృషి, పోరాటం, ప్రయాణం మరింత ఎక్కువగా అర్థమవుతోంది. సినిమా మీద ఆ పేద రైతుకు ఉన్న అభిరుచి వల్లే మేమంతా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం' అని బన్నీ ట్వీట్ చేశాడు.