Nitish Kumar: సుశాంత్ తండ్రి కోరితే సీబీఐ విచారణ చేయిస్తాం: నితీశ్ కుమార్
- సుశాంత్ కేసులో వీడని మిస్టరీ
- సీబీఐ విచారణ చేయించాలని వినిపిస్తున్న డిమాండ్లు
- సానుకూలంగా స్పందించిన బీహార్ సీఎం
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సుశాంత్ తండ్రి సీబీఐ విచారణ కావాలని ప్రభుత్వాన్ని కోరితే అందుకు తాము సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు నితీశ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, గత 45 రోజులుగా కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇంతవరకు మిస్టరీని ఛేదించలేకపోయారని అన్నారు. ప్రస్తుతం బీహార్ పోలీసులు నిజాయతీగా విచారణ చేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని సుశాంత్ సోదరి కోరిన సంగతి తెలిసిందే.