India: దేశంలో 17 లక్షల మార్కును దాటిన కరోనా కేసులు
- 54,736 మందికి కొత్తగా కరోనా
- మొత్తం కేసులు 17,50,724
- మృతుల సంఖ్య మొత్తం 37,364
- 5,67,730 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
భారత్‌లో కొవిడ్-19 కేసులు, మరణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 54,736 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 853 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 17,50,724కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 37,364కి పెరిగింది. 5,67,730 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,45,630 మంది కోలుకున్నారు.
కాగా, నిన్నటి వరకు మొత్తం 1,98,21,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,63,172 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.