TikTok: రాఖీ పండుగపై పాటతో గుర్తింపు తెచ్చుకుని.. పండుగ ముందు రోజే ఆత్మహత్య చేసుకున్న సిద్ధిపేట రాజు

gaddam raju commits suicide
  • సిద్ధిపేటలో ఘటన 
  • ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే..’ పాటతో గుర్తింపు
  • టిక్‌టాక్ స్టార్‌గా ఎదిగిన రాజు
  • పొలం వద్ద ఉరి వేసుకున్న వైనం 
రాఖీ పండుగపై పాటతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ యువకుడు. చివరకు ఆ పండగ ముందు రోజే ఆత్మహత్య చేసుకుని తన అభిమానుల్లో విషాదాన్ని నింపాడు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి గడ్డం రాజు  ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే.. ఇక లేడని ఇక రాడని చెప్పమ్మా’ అనే పాటతో గతంలో టిక్‌టాక్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే, ఈ రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. రాఖీ పండగ ముందు రోజే అతడి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ యువకుడు ఎందుకు బలన్మరణానికి పాల్పడ్డాడన్న విషయంపై కారణాలు తెలియాల్సి ఉంది. రాఖీ పండుగ పాటతో పాటు  రాజు గతంలో అనేక పాటలు పాడి టిక్‌టాక్‌లో స్టార్‌గా ఎదిగాడు.

TikTok
Social Media
Siddipet District

More Telugu News