Eatala: సామాన్యులను పీక్కుతినే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటాం: ఈటల

Eatala warns private hospitals which harasses poor for money

  • కరోనా ఆసుపత్రుల్లో బెడ్ లకు కొరతలేదన్న ఈటల
  • కరోనా వైద్యం ఖరీదనదేమీ కాదని వెల్లడి
  • రూ.10 వేల లోపే ఖర్చవుతుందని వ్యాఖ్యలు

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ, కరోనా ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవద్దని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొవిడ్ వైద్య కేంద్రాలు ఉన్నాయని,

 హైదరాబాదులో చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి, సరోజిని, గాంధీ, గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రులు కరోనా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. కరోనా ట్రీట్ మెంట్ ఖరీదైనదేమీ కాదని, రూ.10 వేల లోపే అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని చెప్పిన ఈటల, సామాన్యులను పీడించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన సందర్భంగా ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News