Andhra Pradesh: రాజధానితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: ఏపీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ

Union Home Ministry file affidavit in AP High Court stating it has no involvement in state capital
  • రాష్ట్ర రాజధాని రాష్ట్రాలకు సంబంధించిన అంశం
  • కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదు
  • ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది. మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోదా? లేక రాష్ట్ర పరిధిలోదా? అనే అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్ లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని చెప్పింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Amaravati
Capital
Union Home Ministry

More Telugu News