Israel: రేసులోకి వచ్చిన ఇజ్రాయిల్... తమ వ్యాక్సిన్ అద్భుతమని ప్రకటన!

Israel Says they Make a Vaccine for Corona

  • వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఎన్నో దేశాలు
  • తాము వ్యాక్సిన్ ను తయారు చేశామని ప్రకటన
  • మానవ ప్రయోగాలు ప్రారంభిస్తామన్న రక్షణ మంత్రి

కరోనాను కట్టడి చేసేందుకు ఎన్నో దేశాలకు చెందిన కంపెనీలు, వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్న వేళ, ఈ రేసులోకి ఇజ్రాయెల్ వచ్చి చేరింది. తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ సిద్ధంగా ఉందంటూ కీలక ప్రకటన చేసింది. ఇక దీన్ని మానవులపై ప్రయోగించాల్సి వుందని, త్వరలోనే ఆ ప్రక్రియను ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి జెన్నీ గాండ్జ్ వెల్లడించారు.

వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్)ని సందర్శించిన ఆయన, అక్కడ జరుగుతున్న పనులను ప్రారంభించారు. వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఈ వ్యాక్సిన్ తో శరీరంలో పెరుగుతాయని ఐఐబీఆర్ డైరెక్టర్ షహీరా వెల్లడించారు. కాగా, ఈ వ్యాక్సిన్ ఎప్పటికి సిద్ధమవుతుందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే, భారీ ఎత్తున ఈ వ్యాక్సిన్ ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైందని, ప్రధాని కార్యాలయం స్వయంగా వ్యాక్సిన్ తయారీని పర్యవేక్షిస్తోందని సమాచారం.

  • Loading...

More Telugu News